Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ పోస్టర్ తో వచ్చిన తంటా - జూనియర్ ఎన్టీఆర్ తప్పిదమేనా !

Advertiesment
Jr NtR flx- ntr ghat - hyd

డీవీ

, గురువారం, 18 జనవరి 2024 (16:47 IST)
Jr NtR flx- ntr ghat - hyd
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుజాతి ఆత్మగౌరవ సూచిక, అన్న నందమూరి తారకరామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే నా ఘన నివాళులు అంటూ నందమూరి బాలక్రిష్ణ ఈరోజు ఉదయం ఎన్.టి.ఆర్. ఘాట్ వద్ద నివాళులర్పించారు. మోహన క్రిష్ణ తదితరులు కూడా హాజరయ్యారు. అయితే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్లీక్సీలు వుండడంతో బాలయ్య ఒక్కసారి ఖంగుతిన్నారు. వెంటనే అవి తీసెయ్యండని ఫ్యాన్స్ అని ఆదేశించారు.
 
Balakrishan nivali
తెల్లవారిజామున నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సందర్శించారు. అక్కడ వారి ఫొటోలతోపాటు హరిక్రిష్ణ వున్న ప్లెక్సీలు పెట్టారు. ఆ తర్వాత బాలక్రిష్ణ కుటుంబ సభ్యులు వచ్చారు. ఆయన నివాలులు అర్పించిన వెంటనే ఆ ఫ్లెక్సీలు చూసిన ఆయనకు ఇగో దెబ్బతింది. అప్పటికే జూనియర్ తో వున్న విభేదాలు బయట పడ్డాయి. 

jr. ntr- kalyanram
వెంటనే బాలయ్య ఆదేశం మేరకు  జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీల తొలగించేశారు. అయితే ఇది జూనియర్ చేసిన తప్పిదంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్లెక్సీలు పెట్టవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
 
ఇదిలా వుండగా, ఈ విషయమై గుడివాడ కు చెందిన వైసిపి నాయకుడు కొడాలి నాని మాట్లాడుతూ, ప్లెక్సీలు పీకివేడయం వల్ల ఎన్.టి.ఆర్.. వెంట్రుకకు కూడా ఏమీ కాదని ఘాటుగా స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సెకండ్ పోస్టర్ రిలీజ్ చేసిన రన్వీర్ సింగ్