దక్షిణ భారత టీవీ పరిశ్రమలో మీరా వాసుదేవన్ దక్కన్ సుపరిచితురాలు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ వినోద రంగాలలో ఆమె నటనతో పాటు, తన్మాత్రలో మోహన్ లాల్‌తో ఆమె అద్భుతమైన నటన ద్వారా ఆమెకు బాగా క్రేజ్ వచ్చింది. ఇంకా ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఎప్పుడూ అభిమానులతో బహిరంగంగానే ఉంటుంది. ఆమె మూడుసార్లు వివాహం చేసుకుంది.
ఈ మూడు వివాహాలు కాస్త విడాకులతో పెటాకులైనాయి. ఇటీవల విపిన్ పుతియంకంతో ఆమె విడిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతనితో వివాహ జీవితం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. ఈ విషయాన్ని మీరా సోషల్ మీడియాలో పంచుకుంది.
మూడోసారి విడాకులు ఇచ్చానని.. జీవితంలోని ఈ దశలో తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరా ముంబైలో పుట్టి పెరిగింది. ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ప్రతి మార్పును పారదర్శకంగా తెలియజేసేయడం ఆమె స్టైల్.