Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50 ఏళ్ల 50 కేజీల తాజమహల్ బ్యూటీ 'ఐష్' బాలీవుడ్ హీరోతో పట్టుబడిందట

Advertiesment
Aishwarya Rai

ఐవీఆర్

, బుధవారం, 30 అక్టోబరు 2024 (18:24 IST)
హాయ్ రా హాయ్ రబ్బా... 50 కెజి తాజ్ మహల్ నువ్వే నువ్వా... అనే ఈ పాట జీన్స్ చిత్రంలోనిది. ఈ చిత్రంలో నటించి టాప్ హీరోయిన్ అయిన నటి ఐశ్వర్యా రాయ్. వచ్చే నెల నవంబరు 1తో ఆమెకి 50 ఏళ్లు నిండుతాయి. ఐష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఏదోవిధంగా ట్రెండ్ చేయాలన్న తలంపులో కొన్ని ఛానళ్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. వారి ప్రయత్నం ఒకింత సక్సెస్ అయినట్లే వుంది. ఎందుకంటే.. ఎప్పుడో 20 ఏళ్ల క్రింద ఐశ్వర్యారాయ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
 
ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... 2005లో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో కలిసి కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్‌కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఐశ్వర్యా రాయ్‌ను కరణ్ జోహార్ అత్యంత విచిత్రమైన పుకారు గురించి ఆమెను అడిగేశాడు. అప్పట్లో ఐశ్వర్య దేవదాస్ చిత్రంలో నటించి వుంది.
 
ఆ వీడియోలో ఆమె చెబుతూ... “నా కెరీర్ ప్రారంభంలో నాగురించి ఓ పత్రిక రాసిన ఓ చెత్త వార్తపై కోర్టుకు వెళ్లాను. వాళ్లు నాపైన రాసిన గాలి వార్త ఏంటంటే.. నేను అక్షయ్ కుమార్‌తో కలిసి ఓ హోటల్లో పట్టుబడ్డాననీ, మమ్మల్నిద్దరినీ రవీనా టాండన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నదని రాసారు. ఇది పూర్తిగా అవాస్తవమని ప్రపంచం మొత్తానికి తెలుసు ” అంటూ చెప్పింది. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి 20 ఏళ్ల కిందటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వుండటంపై ఐశ్వర్యా రాయ్ ఏం చేస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమాన్‌గా రిషబ్ శెట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల