Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్‌ షర్మిల వ్యూహకర్త పీకే..!?

Advertiesment
వైఎస్‌ షర్మిల వ్యూహకర్త పీకే..!?
, మంగళవారం, 27 జులై 2021 (09:07 IST)
తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల వ్యూహాత్మక వైఖరి వెనుక తమిళనాడుకు చెందిన ఓ టీమ్‌ పనిచేస్తుందనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రియ.. వైఎస్‌ కూతురు షర్మిలకు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వాటిపై స్పందించాల్సిన తీరుకు సంబంధించి రాజకీయ వ్యూహాలు విడమర్చి చెబుతోందని  గుసగుసలు వినిపిస్తున్నాయి.

తమిళనాడు తిరువల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియదర్శిని రాజేంద్రన్ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా సేవలందిస్తోంది. డీఎంకే కోసం ప్రశాంత్‌ కిషోర్‌కు తన సర్వే సంస్థ ఎన్‌పీసీ ద్వారా ప్రియ కలిసి పనిచేశారు. షర్మిల కోసం పనిచేస్తున్న ప్రియ తరుచూ ఢిల్లీ వెళ్లి ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ కావడం వైఎస్సార్‌టీపీలో, తెలంగాణలో చర్చకు దారితీస్తోంది. పీకే శిష్యురాలిగా ప్రియ పేరు తరుచుగా వినిపిస్తోంది.

షర్మిల పార్టీ కోసం ఇప్పుడే నేరుగా ప్రశాంత్ కిషోర్ రావడం కరెక్ట్ కాదని... ఆయన శిష్యురాలు ప్రియాను పంపించారన్న చర్చ బలంగా సాగుతోంది. పార్టీలో వైఎస్ షర్మిలకు తప్పా.. రెండో వ్యక్తికి తెలియకుండానే తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు ప్రియా టీం సర్వేలు చేసింది. కొత్త పార్టీ పై ప్రజల స్పందన... వైఎస్సార్ పేరు జనాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా...? మరిచిపోయారా...? ఆ నియోజకవర్గంలో గెలుపుగుర్రాలు ఎవరు..? అనే అంశంలో సీక్రెట్ రిపోర్ట్ షర్మిలకు అందజేసింది వ్యూహకర్త ప్రియ.

టీమ్‌తో వర్క్‌ చేయించిన ప్రియ నేరుగా తెలంగాణకు రావడం లేదు. వైఎస్సార్‌టీపీలో ఎవరినీ కలువని ప్రియ కేవలం షర్మిలతోనే మాట్లాడుతోందట. ఆ తర్వాత ఢీల్లీ వెళ్లి పీకేను కలిసి ఇక్కడి ఇన్‌పుట్స్ అక్కడి డిస్కషన్‌ చేస్తోందట. ఆయనిచ్చే సలహాలు, సూచనలు ఇక్కడ అప్లై చేస్తుందనే టాక్‌ వైసీఆర్‌టీపీలో వినిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో అరుదైన నారాయణ పక్షి