Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధానమంత్రి పదవికి PK స్కెచ్, ఎలాగో తెలుసా?

Advertiesment
PK sketch
, సోమవారం, 3 మే 2021 (18:05 IST)
2014లో నరేంద్ర మోడికి అన్ని సీట్లు వచ్చేట్లు చేసింది ప్రశాంత్ కిషోరే. ఒకప్పుడు గుజరాత్ మోడిని దేశ ప్రధానిగా ఎన్నికల వ్యూహకర్త తన ప్రణాళికలతో, తన ఎన్నికల జిమ్మిక్కులతో దేశవిదేశాలలో కూడా మంచి మైలేజి తెప్పించి మోడిని గెలిపించాడు ప్రశాంత్ కిషోర్.  
 
ఇప్పటికే 6 రాష్ట్రాలను వంటి చేత్తో గెలిపించిన ఒకే ఒక్కరు ప్రశాంత్ కిషోర్. తన election engeering team(i pad )ను వదలి పెడతాను అని నిన్న ఓ ఇంగ్లీఘ చానల్‌లో సంచలనాలు ప్రకటించారు.
 
1) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ తన వారసుడు అని ప్రకటించారు.

2) పంజాబ్ ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి పదవి ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించాడు PK.
 
3) డిల్లీ అసెంబ్లీ ఏన్నికలలో క్రేజీవాల్‌కు పూర్తి మెజారిటీ  తెచ్చి పెట్టాడు.
 
4) ఏపిలో 40 years industry అని చెప్పే చంద్రబాబుకు చుక్కలు చూపించి 90% సీట్లు జగన్  చేతిలో పెట్టాడు.
 
5) నేడు కలకత్తాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మమత బొమ్మను చూపెట్టి తన రాజకీయ చతురతతో తన వటి చేత్తో భాజపాకు రెండు అంకెలు దాటనీయకుండ చేస్తాను అని ముందే ప్రకటించి 77కే నిలుపుదల చేశాడు ప్రశాంత్ కిషోర్.
 
6) తమిళనాడులో డిఎంకీకి గతంలోనే ఇంత మెజారిటీ రాని అన్ని సీట్లు తెచ్చిపెట్టిన ఘనత ప్రశాంత్ కిషోర్ మాత్రమే. 
 
పైన విషయాల బట్టి క్రాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది. కావున ప్రాంతీయ పార్టీల సహాయ సహకారంతో ప్రధాని పోస్టుకు PK స్కెచ్ వేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. మరి వ్యూహకర్త వ్యూహాలు ఏమిటో తెలియాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. పట్ట పగలే చీకట్లు కమ్ముకున్నాయి..