Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంటీ... మావద్దకు వచ్చేయండి: టిక్ టాక్ మోజులో పడ్డ మహిళకు యువ బ్యాచ్ పిలుపు

ఆంటీ... మావద్దకు వచ్చేయండి: టిక్ టాక్ మోజులో పడ్డ మహిళకు యువ బ్యాచ్ పిలుపు
, గురువారం, 13 ఫిబ్రవరి 2020 (19:23 IST)
టిక్ టాక్ ప్రేమ ఢిల్లీ నుంచి హైద్రాబాద్ గల్లీకి రప్పించింది. భర్త, పిల్లలను విడిచి వారం రోజులు యువ బ్యాచ్‌తో జత కట్టి ఉండిపోయింది. ఆమె టిక్ టాక్ ఐడితో.. ఆమె ఫాలోవర్స్ చుట్టూ తిరిగిన భర్త.. చివరికి బేగంపేట ప్రకాష్ నగర్‌లో ఆమె ఆచూకీ కనుగొన్నాడు. ఢిల్లీకి చెందిన ఓ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీలోని ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. 
 
పని ఒత్తిడితో భార్యను కాస్త పట్టించుకోకపోవడంతో ఆమె టిక్ టాక్ యాప్‌కు బానిసగా మారిపోయింది. ఈ తరుణంలో బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఓ యువ బ్యాచ్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె కష్టాలు చెప్పుకోగా... ఆంటీ... మా వద్దకు వచ్చేయండంటూ ఆహ్వానం పలికారు యువకులు.

ఐతే తమ పిలుపుతో ఆమె వస్తుందా.. లేదంటే ఏదో టైమ్ పాస్ అనుకుంటుందా అని అనుకునే లోపే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరింది ఆ మహిళ. దీనితో ఏమి చేయాలో అర్థం కాని ఆ బ్యాచ్.. ఆమెను ఓ ఫ్రెండ్ రూమ్‌లో ఉంచారు. వారం రోజులుగా ఆమె ఇంటికి చేరకపోవడంతో భర్త.. ఆమె టిక్ టాక్ పరిచయస్తుల చుట్టూ తిరిగాడు.
 
చివరికి వీరితో పరిచయం బాగా ఉండటంతో.. వారి ఆచూకీ తెలుసుకొని ప్రకాష్ నగర్ చేరుకున్నాడు. అతని రాక చూసి షాక్ తిన్న బ్యాచ్ ఏమి చెప్పాలో అర్థం కాకపోగా, ఇన్ని రోజులు ఓ మహిళ ఆ రూమ్‌లో ఉంటుందన్న విషయం తెలుసుకున్న కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొడవ పెద్దగా మారడంతో బేగంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఐతే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, బాధితుడి భార్యకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి భర్తతో ఢిల్లీ సాగనంపారు. ఐతే ఇన్ని రోజులుగా మహిళను రూమ్‌లో ఉంచుకున్నా, కనీసం విషయం తెలుసుకోనందుకు ఇంటి యజమానితో పాటు యువకుల తల్లిదండ్రులను పిలిచి మందలించారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీస్తాం.. సుప్రీంలో కేంద్రం పిటిషన్