Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్‌లో కరోనా(కొవిడ్-19) వైరెస్‌తో వచ్చిన ప్రయాణికుడు...

బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్‌లో కరోనా(కొవిడ్-19) వైరెస్‌తో వచ్చిన ప్రయాణికుడు...
, గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:46 IST)
చైనాలో వేల సంఖ్యలో బలి తీసుకుంటున్న కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. విదేశాల నుంచి విమానాల్లో కానీ నౌకల ద్వారా గానీ ఎవరన్నా వస్తున్నారంటే చచ్చేంత భయమేస్తోంది. వచ్చినవారిని తనిఖీలు చేస్తుంటే కొవిడ్-19 తో బాధపడేవారు కనీసం ఇద్దరుముగ్గురు తేలుతున్నారు. దీనితో భారతదేశం అప్రమత్తమయ్యింది. 
 
తాజాగా బ్యాంకాక్ నుంచి దిల్లీకి స్పైస్ జెట్లో వచ్చిన ఓ ప్రయాణికుడికి కొవిడ్-19 వున్నట్లు తేలింది. అతడు స్పైస్ జెట్ ఎస్జీ 88లో 31వ నెంబర్ సీటులో కూర్చుని వచ్చాడు. దీనితో అతడి ప్రక్కనే మరెవరైనా కూర్చుని వచ్చారేమోనని చెక్ చేయగా ఎవరూ రాలేదని తేలింది. 
 
కాగా కొవిడ్ అనుమానితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పర్యవేక్షణలో వుంచారు. అంతేకాదు... బ్యాంకాక్ నుంచి కోల్ కతాకు వచ్చిన విమానంలో మరో ఇద్దరికి కొవిడ్ సోకిందని పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. దీనితో మన దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 1300 మందికి పైగా మరణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియాను ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ మారుస్తాం : ప్రధాన మోడీ