Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాల్షియం కావాలంటే.. పెరుగు తినాల్సిందే..

క్యాల్షియం కావాలంటే.. పెరుగు తినాల్సిందే..
, గురువారం, 13 ఫిబ్రవరి 2020 (19:09 IST)
అవును.. శరీరానికి తగిన క్యాల్షియం అందాలంటే.. రోజు మధ్యాహ్నం భోజనంలో పెరుగును భాగం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మహిళలు పెరుగును రోజూ ఓ కప్పు తీసుకోవాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

పెరుగులో కీలక పోషకాలు, విటమిన్లున్నాయి. క్యాల్షియం, విటమిన్ బిలు పెరుగులో వున్నాయి. పెరుగు నరాల బలహీనతను దూరం చేస్తుంది. చర్మ వ్యాధులకు చెక్ పెడుతుంది. 
 
శరీరానికి చలవనిచ్చే పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా అజీర్తి వుండదు. పాలలో లాక్టోన్ వుంది. పెరుగులో లాక్టోపసిల్ వుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలను తొలగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. చర్మకాంతిని పొందేందుకు, చర్మ సమస్యలను చెక్ పెట్టేందుకు పెరుగు, మజ్జిగ భేష్‌గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయి.

రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ. పెరుగులో ఉండే క్యాల్షియం ఫాస్పరస్ ఎముకలకు దంతాలను బలంగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను అడ్డుకునే శక్తి పెరుగులో ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొజ్జను తగ్గించే, మధుమేహానికి చెక్ పెట్టే ఆసనం.. ఇదో!