కరోనా వ్యాక్సిన్ కోసం వెళితే రాబిస్ టీకా ఇచ్చారట. నల్గొండ జిల్లా కట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకొని కట్టమూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళారట ప్రమీల.
పిహెచ్‌సిలో సాధారణ టీకాలు ఇస్తుండగా పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పిహెచ్‌సికి వెళ్ళారు. అదే సమయంలో వచ్చిన మహిళకు నర్స్ యాంటీ రాబిస్ వ్యాక్సిన్‌ను వేశారు.
కరోనా టీకా వేయాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకు అదే సిరంజితో యాంటీ రాబిస్ టీకా వేసిందని ప్రమీల ఆరోపిస్తున్నారు. ఆ టీకా వేసుకున్నప్పటికి నుంచి ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తోందని బాధితురాలు చెబుతోంది. దీనిపై విచారణకు ఆదేశించారు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు.