Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగ్యనగరి నిత్యానంద : ఆశ్రమంలో శృంగార పాఠాలు చెబుతున్న స్వామి జీ!

Advertiesment
భాగ్యనగరి నిత్యానంద : ఆశ్రమంలో శృంగార పాఠాలు చెబుతున్న స్వామి జీ!
, గురువారం, 19 నవంబరు 2020 (16:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో నిత్యానంద స్వామి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఓ సినిమా హీరోయిన్‌తో శృంగారం చేస్తూ పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయనపై అనేక మంది మహిళ భక్తురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఏకంగా దేశం విడిచిపారిపోయాడు. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసి.. దానికి కైలాస దేశం అని నామకరణం చేశారు. ఈ దీవికి పరిపాలనాదక్షుడుగా తనను తాను నిత్యానంద ప్రకటించుకున్నారు. దేశ పాలన చేసేందుకు ఏకంగా ఓ కరెన్సీని ప్రవేశపెట్టారు. 
 
ఈ క్రమంలో భాగ్యనగరిలో మరో నిత్యానంద స్వామి వెలుగు చూశారు. భక్తి పేరుతో పలువురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు.. అనేక మందిని మోసం చేస్తున్న ఓ వైద్యుడి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ స్వామిజీపై ఆయన భార్య సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఇచ్చిన ఓ ఫిర్యాదుతో ఈ బండారం బట్టబయలైంది. అంతేకాదండోయ్... ఆ స్వామిజీ భార్య కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తనను పెళ్లి చేసుకుని మానసిక క్షోభకు, వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వాపోయింది. తన భర్త డాక్టర్ ప్రదీప్ జోషి స్వామిజీ వేషంలో మహిళలను లొంగదీసుకుంటున్నట్టు ఫిర్యాదులో వెల్లడించింది.
 
ఈ నకిలీ స్వామిజీ భార్య ఇచ్చిన ఫిర్యాదులోని పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే, మణికొండలో ఆశ్రమం నిర్వహించే డాక్టర్ ప్రదీప్ జోషి తన కంటే ముందుగానే రెండు వివాహాలు చేసుకున్నాడని వాపోయింది. కానీ, తనకు మాత్రం మొదటి వివాహం విడాకులు అయినట్టుగా చెప్పి పెండ్లి చేసుకున్నాడని తెలిపింది. 
 
ఆధ్యాత్మిక గురువు కావడంతో నమ్మి తనను 2019 మార్చి 8వ తేదీన తిరుమల తిరుపతి అహోబిల మఠంలో వివాహాం చేసుకున్నట్టు తెలిపింది. వివాహాం అయిన దగ్గర్నుంచి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గోడు వెళ్ళబోసుకుంది. వివాహాం సమయంలో గోల్డ్ చైన్, డైమండ్ రింగ్, వెండి ప్లేట్, వెండి పూజా సామాగ్రితో పాటు బంగారం ఆభరణాలు తదితర రూ.15 లక్షల విలువ చేసే వస్తువులు ఇచ్చినట్టుగా వాపోయింది. 
 
అయినా, ప్రదీప్ జోషికి అనేక మంది మహిళలతో వివాహేత సంబంధాలు ఉన్నాయని.. అంతేకాకుండా, నిత్యం నిత్యానంద స్వామీజీ వీడియోలను చూసేవాడని, నిత్యానంద స్వామిజీలాగా ప్రత్యేక సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని తన ధ్యేయంగా చెప్పుకునేవాడని పేర్కొంది.
 
హైదరాబాద్‌తో పాటు బెంగుళూరులోనూ ఇతనికి ప్రత్యేక శిబిరం నిర్వహిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నట్టు తెలిపింది. తనను వేధించే సమయంలో అవసరమైతే కోర్టుకు వెళ్తావా? లేదంటే మీడియా? పోలీసుల వద్దకు వెళ్ళినా? ఏ సమయంలో నాపై 498 (ఏ) కేసు ఫిర్యాదు చేసినా ఐ డోంట్ కేర్ అంటూ బెదిరించినట్టుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఉమెన్ పీఎస్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ సర్కారు కొరఢా... ముఖానికి మాస్క్ ధరించకుంటే రూ.2 వేలు ఫైన్