Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద బాధితులకు ఇంకా సాయం చేస్తాం: కేటీఆర్

వరద బాధితులకు ఇంకా సాయం చేస్తాం: కేటీఆర్
, బుధవారం, 21 అక్టోబరు 2020 (09:41 IST)
ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కే .చంద్రశేఖరరావు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి కే. తారకరామారావు పలువురికి అందించారు.

ఖైరతాబాద్ లోని ఎమ్మెస్ మక్త తోపాటు షేక్ పేట, నదీమ్ కాలనీ, నాగోల్, లింగోజిగూడాలో వరద ముంపు ప్రభావానికి గురైన పలు కుటుంబాలను పరిశీలించి, వారితో మాట్లాడి వారికి తక్షణ సాయంగా ప్రభుత్వం తరఫున పదివేల రూపాయల నగదును మంత్రి కేటీఆర్ అందించారు.

ఈ సందర్భంగా ముంపుకు గురైన పలు కుంటుంబాలను మంత్రి పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న పదివేల సహాయం తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమే అని, వరదల్లో ఇళ్లు పాక్షికంగా, లేదా పూర్తిగా నష్టపోతే వారికి మరింత సహాయం అందిస్తామని తెలిపారు.

నగరంలో ఏంత మంది భాదితులు ఉంటే అంత మందికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి అదేశాల మేరకు నగరంలో ఈరోజు అనేక చోట్ల నగదు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు.

బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దనే ఈ ఆర్థిక సహాయం అందజేస్తామన్న  కెటియార్, అవసరమైతే ఈ సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమని, వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి వ్యక్తికి/కుటుంబానికి ఈ సాయం అందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారని తెలిపారు. ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేటట్టు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సహాయాన్ని స్వయంగా అందించి భరోసా నింపేందుకు కాలనీల్లో పర్యటిస్తున్నామని మంత్రి కెటియార్ వారికి తెలిపారు. రానున్న ఒకటి రెండు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసేందుకు అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో వరద నివారణకు పలువురు నాలాల నిర్మాణం వంటి శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తామని హమీ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఏంఏల్యేలు దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు లు మంత్రి వెంట ఉన్నారు. 
 
నగర ప్రజా ప్రతినిధులతో మంత్రి కెటియార్ సమావేశం-రానున్న పదిరోజులు క్షేత్రంలో ఉండాలని సూచన
నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కే. తారకరామారావు ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశాన్ని నిర్వహించారు.

ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వారికి పలు సూచనలు చేశారు. రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని కోరారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ తక్షణ సాయం అందాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పనిచేయాలని సూచించారు.

తక్షణ సహాయం అందిస్తూనే మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని, అక్కడ అవసరం అయిన టాయిలెట్స్, దుప్పట్లు, మందులు, భోజనాలు అందేలా చూడాలన్నారు.

ప్రస్తుతం ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని, ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో రిస్టోరేషన్ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న నగర యంఏల్యేలు, ఏంఏల్సీలు, ఏంపీలను మంత్రి కెటియార్ అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కోవిడ్-19'లో వాస్తవాలు