Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబులెన్స్ లను ప్రొరంభించిన కేటీఆర్

Advertiesment
అంబులెన్స్ లను ప్రొరంభించిన కేటీఆర్
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:58 IST)
ఐటీ, మున్సిపల్ ‌శాఖ మంత్రి కెటిఆర్‌ కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి 3 అంబులెన్స్ లను, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ 2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు1 అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.

అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు ప్రభుత్వానికి అందజేసిన వారికి కెటిఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. కెటిఆర్‌ జన్మదిదనం సంద‌ర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ ఏకార్యక్రమంలో భాగంగా కరోనా బాధితుల కోసం కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను గిఫ్ట్ గా ఇచ్చామ‌న్నారు.

నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని క‌లెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ అంబులెన్స్ ల‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు