Publish Date: Mon, 01 Nov 2021 (18:01 IST)
Updated Date: Mon, 01 Nov 2021 (18:03 IST)
హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులు దారుణ హత్యకు గురయ్యారు. హబీబ్‌నగర్, నాంపల్లి పరిధిలో దుండగులు ఇద్దరు యాచకుల తలపై రాళ్లతో మోది హత్య చేశారు. ఈ ఇద్దరు యాచకులను ఒకరే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
పోస్టుమార్టం కోసం యాచకుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసి సిసిటివి పుటేజీల ఆధారంగా కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. తొలి హత్య హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఒక యాచకుడిని తలపై రాయితో మోది చంపేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడి తలను రాయితో కొట్టి చంపేశారు. రెండు హత్యల్లో కూడా తలపై రాయితో మోది చంపడంతో... ఈ రెండు హత్యలు ఒకరే చేసుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.