Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి తుల ఉమ రాజీనామా- వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి..?

Advertiesment
Tula Uma
, సోమవారం, 13 నవంబరు 2023 (20:08 IST)
Tula Uma
బీజేపీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తనకు అన్యాయం చేసినందుకు బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
బీజేపీ అప్పగించిన ప్రతి పనిని విజయవంతం చేసేందుకు కృషి చేశానన్నారు తుల ఉమ. తన సేవను గుర్తించి వేములవాడ టికెట్ ఇచ్చారని, అయితే చివరి నిమిషంలో బీఫాం మరొకరికి ఇచ్చి తనను అవమానించారని లేఖలో పేర్కొన్నారు. 
 
ఓ ఉద్యమకారురాలిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సేవ చేసుకునే భాగ్యం తనకు లభించిందన్నారు. 
 
ఈ ప్రాంత ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే టికెట్లు తెంపలేవన్నారు తుల ఉమ. కార్యకర్తలు, అనుచరులు, ప్రజల అభిప్రాయం మేరకు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం