అలంపూర్ అభ్యర్థిగా అబ్రహం పేరును ప్రకటించిన బీఆర్ఎస్.. చివరి నిమిషంలో స్థానిక నేతకు ఝలక్ ఇచ్చారు. దీంతో అలంపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున అబ్రహం గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ అవకాశం కల్పించారు.
అందుకు సంబంధించిన జాబితాను కూడా ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రకటించిన జాబితాలో అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు ఉంది. అబ్రహంను అభ్యర్థిగా ఖరారు చేస్తే.. ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చల్లా వర్గం తేల్చి చెప్పింది.
నాంపల్లిలో సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్‌కు చెందిన ఎండీ ఫిరోజ్ ఖాన్, ఎఐఎంఐఎం నుండి ఎండీ మాజిద్ హుస్సేన్‌తో తలపడగా, గోషామహల్‌లో బిజెపికి చెందిన టి.రాజా సింగ్ మరియు కాంగ్రెస్‌కు చెందిన మొగిలి సునీతతో పోటీపడనుంది.