Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాల్వాయి స్రవంతి రాజీనామా-కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

Palvai Sravanthi
, శనివారం, 11 నవంబరు 2023 (12:56 IST)
Palvai Sravanthi
మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు.
 
మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డి పేరు ప్రకటించిన రోజునే ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. కానీ ఇంతలోనే ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్ సిటీ దగ్గర బాణసంచా షాపులో అగ్నిప్రమాదం