Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారంపై నివేదిక ఇవ్వండి.. గవర్నర్ తమిళిసై

tamizhisai sounderrajan
, ఆదివారం, 5 జూన్ 2022 (17:02 IST)
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ మండిపడ్డారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆమె ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె సూచిస్తూనే, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
 
కాగా, ఇటీవల అమ్నీషియా పబ్ నుంచి ఓ బాలికను మైనర్లతో కలిపి ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విపక్ష పార్టీల నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఈ అత్యాచార ఘటన వెనుక తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. ఇటు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు మైనార్టీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, తెరాస కీలక నేత కుమారుడు సహా ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వెల్లడి