Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడుకునేంకు వెళితే మూడు చేతివేళ్లు పోయాయి.. ఎలా?

Advertiesment
kid finger cut
, సోమవారం, 8 మే 2023 (09:56 IST)
హైదరాబాద్ నగరంలో ఆడుకునేందుకు వెళ్లిన ఓ చిన్నారి తన మూడు చేతి వేళ్లను కోల్పోయింది. రోబోటిక్ స్పేస్ షటిల్ క్రీడా యంత్రంలో చేతులు పెట్టడంతో ఆ బాలిక చేతి వేళ్లు కోల్పోయింది. హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బంజారాహిల్స్‌ పరిధి ఇబ్రహీంనగర్‌లో నివసించే ప్రైవేటు ఉద్యోగి సయ్యద్‌ మక్సూద్‌ అలీ సతీమణి మెహతాబ్‌ జహాన్‌ శనివారం తన ముగ్గురు పిల్లలు, మేనకోడలిని సరదాగా ఆటలు ఆడించడానికని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు ఒకటిలో ఉన్న కల స్మాష్‌ బౌలింగ్‌ గేమింగ్‌ ప్లేజోన్‌కు తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో మక్సూద్‌, జహాన్‌ దంపతుల మూడేళ్ల కుమార్తె మెహ్విష్‌ లుబ్న కేరింతలు కొడుతూ అందులోని ఓ రోబోటిక్‌ స్పేస్‌ షటిల్‌ క్రీడాయంత్రం వద్దకు వెళ్లింది. యంత్రం వెనుకభాగంలో మూత(డోర్‌) తెరిచి ఉండటంతో దాన్ని ఆట ఆడుకునే ప్రాంతంగా భావించి కుడిచేయి పెట్టింది. దీంతో యంత్రానికి చిక్కి ఆమె మూడు వేళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఎడమ చేతి చూపుడి వేలు చివరి భాగం సైతం నలిగిపోయింది. 
 
చిన్నారి ఒక్కసారిగా గుక్కపెట్టి గట్టిగా ఏడవడంతో తల్లి అక్కడికి పరుగుపరుగున చేరుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి కుడిచేతి మూడు వేళ్లను తొలగించారు. ఘటనపై చిన్నారి తండ్రి మక్సూద్‌ ఆదివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రాథమికంగా గుర్తించి నిర్వాహకులపై కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరవ తరగతి అమ్మాయి పదో తరగతి పాసైంది.. ఎలా?