ఆరవ తరగతి అమ్మాయి పదో తరగతి పరీక్ష పాసైంది. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు చదువుతున్నది నిజమే. ఆరో తరగతి బాలిక పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 566 మార్కులు సాధించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి (11) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
బాలిక తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి మంగళగిరి స్టేట్‌బ్యాంకు ఉద్యోగి కాగా, తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేశారు. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లో ప్రతిభ కనబరుస్తున్న అనఘాలక్ష్మి.. గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకుంది. దీంతో పాటు పదో తరగతి పరీక్షలు కూడా రాసింది. శనివారం విడుదలైన ఫలితాల్లో బాలిక 566 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది.