హైదరాబాద్ నగరంలో వివిధ రకాలైన నేరాలు పెరిగిపోతున్నాయి. వీటిని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీదసాములా మారింది. ముఖ్యంగా, నగరంలో నేర నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నేరాలు చేసేవారితో పాటు నేరాలు చేసే వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
తాజాగా రాత్రివేళల్లో ఏకంగా నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసు రద్దీ నియంత్రించే కూడలి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలిస్తున్నారు. ఈ చోరీలు గత కొంత కాలంగా సాగుతున్న పోలీసులకు చిక్కడంలేదు. ఏట్టకేలకు పోలీసులు పక్కా స్కెచ్ వేసి దొంగలను పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని గత కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో వరుసగా ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న నిందితులను వలపన్ని అబిడ్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో కలిసి పట్టకున్నారు.
వీరిని షేక్ అజీముద్దిన్ అలియాస్ అజీమ్, జంగాల మద్దిలేటి అను అనే నిందితులు బేగంబజార్, బేగంపేట్, కాచిగూడ, లంగర్‌హౌజ్, హబీబ్‌నగర్, గోపాలపురం, మలక్‌పేట, షహినయాత్గాంజ్, సైఫాబాద్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను చోరి చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇలా చోరీ చేసిన బ్యాటరీల్లో 26 పెద్ద బ్యాటరీలు, 48 చిన్న బ్యాటరీలు ఉన్నాయని వెల్లడించారు. వీటి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వీరిపై హైదరాబాద్ నగరంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో 11 కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని స్పష్టం చేశారు.