Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

UNWTO: ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’గా పోచంపల్లి

UNWTO: ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’గా పోచంపల్లి
, మంగళవారం, 16 నవంబరు 2021 (16:53 IST)
pochampally
తెలంగాణ, హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి గ్రామం.. చేనేత వస్త్రాలకు గుర్తింపు పొందింది. ఈ గ్రామానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే వందలాది మంది విదేశీయులు సందర్శించారు. ఐక్యరాజ్యసమితి.. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ అర్హత పోటీలకు దేశం నుంచి ఈసారి 3 గ్రామాలు పోటీ పడ్డాయి.

తెలంగాణకు చెందిన భూదాన్ పోచంపల్లితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన లద్‌పురాఖాస్, మేఘాలయలోని కాంగ్‌థాన్ గ్రామాల‌ను కేంద్రం సిఫార్సు చేసింది. వీటిలో భూదాన్ పోచంపల్లి ఈ అరుదైన ఘనతను దక్కించుకుంది.
 
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ గుర్తింపునిచ్చింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో డిసెంబర్ 2న జరిగే UNWTO 24వ సమావేశంలో పోచంపల్లికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
 
భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో భూదానోద్యమంతో ఈ గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1951లో వినోభా బావే పర్యటన సందర్భంగా ఈ గ్రామానికి చెందిన వెదిరి రామచంద్రారెడ్డి అణగారిన వర్గాల వారికి దానం చేయడానికి తన వందల ఎకరాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత ఈ ఉద్యమం దేశవ్యాప్తమైంది. అలా చరిత్రలో ఈ గ్రామం తన ప్రత్యేకతను పదిలం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండి సంజయ్‌ కుమార్‌‌పై కేసు నమోదు...