Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లై 16 రోజులే.. వరకట్నపు దాహానికి నవవధువు బలి

పెళ్లై 16 రోజులే.. వరకట్నపు దాహానికి నవవధువు బలి
, మంగళవారం, 16 నవంబరు 2021 (12:06 IST)
పెళ్లై 16 రోజుల పండుగ ముచ్చట కూడా తీరనేలేదు. ఇంతలోనే కాసుల కోసం కోడల్ని వేధింపులు మొదలయ్యాయి. కొట్టి తిట్టి కొత్త కోడల్ని నానా హింసలకు గురిచేసి ప్రాణాలు బలిగొన్న దారుణ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరకట్నపు దాహానికి ఓ నవ వధువు బలైపోయింది.
 
భర్త, అత్తామామ వేధింపులు భరించలేక నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటనలో దర్యాప్తు చేపట్టిన గుంటూరు పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు రూరల్ మండలం పొత్తూరులో నవ వధువు అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అత్తమామల కాసుల దాహానికి నవ వధువు మృతి చెందినట్లుగా తేలింది.
 
వివరాల్లోకి వెళితే.. పొత్తూరు గ్రామానికి చెందిన గోపాల కృష్ణారెడ్డితో స్వప్న శ్రీకి పదహారు రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లిలో అన్ని లాంఛనలతో పుట్టింటి వారు ఘనంగా వివాహం జరిపించారు. ఈ క్రమంలో కోటి ఆశలతో అత్తారింట్లోకి గత సోమవారం కొత్త పెళ్లి కూతురు స్వప్న శ్రీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె చనిపోయిన విషయాన్ని అలస్యంగా అత్తింటివారు ఆమె పుట్టింటివారికి ఆలస్యంగా చెప్పారు. 
 
కూతురు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తూ వచ్చారు. కూతురు స్వప్నశ్రీ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. భర్త, అత్తమామలే అదనపు కట్నం కోసం కొట్టి చంపారంటూ ఆవేదనతో ఆరోపించారు. 
 
నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో స్వప్ప శ్రీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మా బిడ్డను బలిగొన్నవారిని కఠినంగా శిక్షాలని వేడుకుంటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు రూరల్ పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టానికి పంపి విచారణ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోమయంలో ఆంధ్రా సర్పంచులు... అడకత్తెరలో పోకచెక్క!