Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో పెద్దపులి.. జడుసుకుంటున్న జనాలు

తెలంగాణలో పెద్దపులి.. జడుసుకుంటున్న జనాలు
, గురువారం, 17 డిశెంబరు 2020 (11:13 IST)
తెలంగాణలో పెద్దపులి ప్రజలను భయపెడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే లక్ష్మీదేవి పల్లి, మణుగూరు ప్రాంతంలో కనిపించిన పులి.. తాజాగా చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తున్నది.

గురువారం తెల్లవారుజామున పులి సంచరించిన ఆనవాలను గ్రామస్తులు గుర్తించారు. అవి పెద్దపెలి పాదముద్రలని అనుమానిస్తున్నారు. విషయాన్ని అటవీ అధికారులు తెలియజేశారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
 
డిసెంబర్‌ 14న లక్ష్మీదేవిపల్లి మండలం అనిషెట్టిపల్లి గ్రామం గుళ్లమడుగు సమీపంలో పెద్ద పులి సంచరించింది. సోమవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పులి దాడి చేసింది. అదేవిధంగా, గతవారంలో సింగరేణి మణుగూరు ఏరియా ప్రకాశం గని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పెద్దపులి సంచరించింది. సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 
 
అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో వరుసగా పులి దాడులు చోటుచేసుకుంటున్నాయి. పెన్‌గంగా తీరం గొల్లఘాట్ దగ్గర ఆవుపై పులి దాడికి పాల్పడింది. అలాగే పశువుల కాపరులను కూడా పులి పరుగులు పెట్టించింది. పులి సంచరిస్తున్నట్లు స్థానికులకు తెలియడంతో తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. పొలంలోకి వెళ్తే ఏ క్షణాన ఏమౌతుందోనని ప్రాణాలు గుప్పెట్లోపెట్టుకుని జీవిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించాలని వేడుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎముకలు కొరికే చలిలో అర్థరాత్రి 180 కి.మీ రన్.. విజయ్ దివస్..?