Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం

kanti velugu
, బుధవారం, 18 జనవరి 2023 (11:22 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం జనవరి 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీశ్ రావు జిల్లాలోని మంత్‌వురి అనే గ్రామంలో ప్రారంభిస్తారు. కంటి వెలుగు పరీక్షలకు సంబంధించిన పరికరాలు, కళ్లఅద్దాలు, మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు పథకం కింద పరీక్షలు చేయించుకోదలచిన వారు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 16533 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే, కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మంలో జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఏర్పాట్లలో హరీశ్ రావు నిమగ్నమైవున్నారు. దీంతో ఆయన అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
 
అలాగే, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో షాకింగ్ ఘటన... బైకుతో పాటు రోడ్డుపై ఊడ్చుకెళ్లిన వ్యక్తి (video)