నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం.. విద్యా విధానంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు. ఇక, ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లీష్ పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన జరుగుతుందని వెల్లడించారు.
వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్ ఉంటుందని.. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.