Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ బంపర్ ఆఫర్.. తెలంగాణ నిరుద్యోగులకు రూ.2 వేల భృతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలవారీ భృతి కింద రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు వి

కేసీఆర్ బంపర్ ఆఫర్.. తెలంగాణ నిరుద్యోగులకు రూ.2 వేల భృతి
, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (14:50 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలవారీ భృతి కింద రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు విధివిధానాలపై ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించారు. 
 
ప్రతినెలా పింఛన్ తరహాలో నేరుగా నిరుద్యోగుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఈ తరహా భృతి ఇచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌ను ఆకాశానికెత్తనున్నారు. 
 
ఇదిలావుండగా, రాష్ట్రంలో 2,630 రైతు వేదికలను నిర్మించాలని సీఎం ఆదేశించారు. రైతులకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించడానికి, వారు చర్చించుకుని అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఈ వేదికలను వినియోగించాలని కోరారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని ఆయన నిర్దేశించారు. 
 
రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలు, ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రాంతీయసదస్సుల గురించి గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రైతు వేదికల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేయాలని, ప్రభుత్వ భూముల నుంచి లేదా కొనుగోలు చేసి సేకరించాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీ పునాదులు స్ట్రాంగ్‌గా వేస్తున్నా .. దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే : రజనీకాంత్