తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 226 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. 1584 మంది మరణించారు.
ప్రస్తుతం తెలంగాణలో 3,920 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,86,894 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్ట్టు చెబుతున్నారు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్ధులను ప్రమోట్ చేయాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉందని అంటున్నారు.
ప్రభుత్వానికి ఈ మేరకు ఇంటర్ బోర్డ్ ప్రతి పాదనలు పంపినట్టు చెబుతున్నారు. ఎంసెట్ సిలబస్ ఖరారు చేసేందుకు వారంలో ఉన్నత విద్యామండలి తో ఇంటర్ అధికారుల భేటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
అకడమిక్ క్యాలెండర్ లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్, రివిజన్ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రభుత్వం నుండి అనుమతి రాగానే రెండు మూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని భావించినా, అదే మాసంలో అత్యధికంగా 10 రోజులు సెలవులుండటం, అంతే కాక జేఈఈ మెయిన్స్ పరీక్షలతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.