Publish Date: Wed, 20 Jan 2021 (10:35 IST)
Updated Date: Wed, 20 Jan 2021 (10:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8గంటల వరకు 27,471 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
మంగళవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,583కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 351 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,86,893కి చేరింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,919 ఉండగా వీరిలో 2,270 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,42,537కి చేరింది.