ఏపీ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలకుదిన సభ్యులు నువ్వానేనా అనే రీతిలో తలపడుతున్నారు. ముఖ్యంగా, వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీ మరణాలతో పాటు రాష్ట్రంలో ఏరులై పారుతున్న బ్రాండ్ల మద్యం క్వాలిటిప చర్చించని టీడపీ సభ్యులు పట్టుబడుతున్నారు.
కానీ, అధికార సభ్యులు మాత్రం చర్చకు ససేమిరా అంటుంది. దీంతో టీడీపే సభ్యలు తమ నిరసనను సభలో వినూత్నంగా తెలియజేస్తున్నారు. ఇందులోభాగంగా టీడీపీ సభ్యులు బుధవారం సభలో చిడతలు వాయించారు.
అయితే, చిడతలు వాయించిన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్తైనా సంస్కారం, ఇంజ్ఞితజ్ఞానం ఉందా అంటూ మండిపడ్డారు. తెదేపా సభ్యులు సభ గౌవర మార్యాదలను తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు.