ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోమారు సస్పెండ్ చేశారు. కల్తీసారా, బెల్టు షాపులపై చర్చ చేపట్టాలను వారు చర్చకు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో తెదేపా సభ్యులు అసెంబ్లీ ఆందోళనలకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా తెదేపా సభ్యులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై తెదేపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
మరో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, పెగాసస్‌పై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు విచారణ కమిటీ కూడా వేసిందని తెలిపారు. దేశంలో ఆ స్పై వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు, ఎలా వినియోగించారనేది తేలాల్సి ఉందని చెప్పారు.