Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాదంలో చినజీయర్... సమ్మక్క-సారక్క.. వాళ్లేం దేవతలా..?

వివాదంలో చినజీయర్... సమ్మక్క-సారక్క.. వాళ్లేం దేవతలా..?
, బుధవారం, 16 మార్చి 2022 (17:11 IST)
ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో మాంసాహారం తినేవారి విషయంలో కులాల విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా చినజీయర్ వనదేవతలు సమ్మక్క, సారక్కలపై చేసిన వ్యాఖ్యల వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
''వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత. గ్రామదేవత. అక్కడుండేవాళ్లు చేసుకోనీ, సరే. చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ ఇప్పుడు. అది వ్యాపారమైపోయింది ఇప్పుడు. ఎంత అన్యాయం..? అది ఒక చెడు. కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో.'' అంటూ ఆ వీడియోలో చినజీయర్ స్వామి వన దేవుతల్ని కించపరిచేలా మాట్లాడారు.
 
అయితే చినజీయర్ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పటిది కాదు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రోజువారీగా ఆయన ప్రవచనాలు అందులో ప్రసారమయ్యేవి. అప్పట్లో ఎలాంటి వివాదం కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆ వీడియో వైరల్ కావడంతో చినజీయర్‌పై సమ్మక్క-సారలమ్మ భక్తులు భగ్గుమంటున్నారు. 
 
చినజీయర్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని మేడారం సమ్మక్క సారలమ్మల పూజారి రఘుపతి డిమాండ్ చేశారు. చినజీయర్‌ సమతామూర్తిని దేవుడిలా ఎలా పూజిస్తున్నారో తాము కూడా సమ్మక్క, సారలమ్మను పూజిస్తున్నామన్నామని చెబుతున్నారు. 
 
ఇంకా ఆంధ్రా చినజీయర్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరితమైన మాట్లాడారని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన జీయర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి. తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు
 
అలాగే సీపీఐ నేత నారాయణ కూడా మేడారాన్ని ఆదివాసీలు పవిత్ర స్థలంగా భావిస్తారని సమ్మక్క, సారలమ్మను తేలిగ్గా మాట్లాడడం సబబు కాదన్నారు. చినజీయర్ క్షమాపణలు చెప్పాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీకి ప్రైవేట్ బంకుల్లో ఇంధనమే మేలు - మంత్రి పేర్ని నాని