అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడింది. సభలో గ్రామపంచాయతీల గురించి పలు ప్రశ్నలను ఎమ్మెల్యే సీతక్క లేవదీసింది. అలాగే ఆమె మాట్లాడుతూ గ్రామాలకు ఇచ్చే నిధులు సరిపోతున్నాయా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ 'గ్రామ పంచాయితీ సమస్యలపై మాట్లాడితే సర్కార్‌కు ఎందుకంత ఉలిక్కిపాటు.. మేం మాట్లాడితే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ అంత మేధావులం కాదు... ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా` అంటూ ప్రశ్నించారు. తాను కేవలం ప్రశ్నలే అడిగానని.. రాజకీయం మాట్లాడడం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె డీవీయేట్ అవుతున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. మాట్లాడే భాష సరి కాదని.. ప్రశ్నకే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు.