Publish Date: Mon, 16 Aug 2021 (08:06 IST)
Updated Date: Mon, 16 Aug 2021 (08:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో, సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
ముఖ్యంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెంట్లంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.