Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర

12న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర
, శుక్రవారం, 3 జులై 2020 (17:07 IST)
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 12న సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ, పోలీసుశాఖ అధికారులతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

ప్రతి ఏటా ఎంతో ఘనంగా లక్షలాదిమంది భక్తుల సమక్షంలో నిర్వహించే బోనాల జాతరను కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం 12వ తేదీన జరిగే జాతర పూజలు, బోనాల సమర్పణ ఆలయం లోపల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఆలయ అధికారులు, పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఇతరులు ఎవరిని అనుమతించబోరని, పరిస్థితులను అర్ధం చేసుకుని భక్తులు సహకరించాలని కోరారు.

అదేవిధంగా 13వ తేదీన రంగం కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని, దీనిని ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. జాతర వద్ద పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఈఓలు మనోహర్, అన్నపూర్ణ, ఆలయ ట్రస్టీ కామేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారంరోజుల్లో విజయవాడ రోడ్లు మరమ్మత్తులు: ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కేశినేని శ్వేత