Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7 అంతస్తుల్లో తెలంగాణ సచివాలయం... అబ్బో.. ఎన్ని సౌకర్యాలో...

Advertiesment
7 అంతస్తుల్లో తెలంగాణ సచివాలయం... అబ్బో.. ఎన్ని సౌకర్యాలో...
, గురువారం, 6 ఆగస్టు 2020 (09:07 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనం. ఇది ఏడు అంతస్తుల్లో నిర్మాణం కానుంది. ఈ కొత్త సచివాలయ నిర్మాణానికి బుధవారం జరిగిన ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, తుది డిజైన్లకు కేబినెట్ సమ్మతం తెలిపింది. 
 
'అర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్నితోపాటు ఇంజినీర్స్‌ సత్యవాణి ప్రాజెక్ట్స్‌ అండ్‌ కన్సల్టేషన్‌ ఈ డిజైన్‌ను రూపొందించారు. మొత్తం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 7 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. గతంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని భావించినా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌లో మార్పులు చేశారు. 
 
తాజా డిజైన్‌ ప్రకారం... 7 అంతస్తులకుపైన భవనం మధ్య భాగంలో సెంట్రల్‌ టవర్‌ ఉంటుంది. ఇందులో మరో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తుతో ఉంటుంది. సెంట్రల్‌ టవర్‌పై 48 అడుగుల ఎత్తుతో తూర్పు, పడమరవైపు 'స్కైలాంజ్‌'లు నిర్మించనున్నారు. వీటిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం (డోమ్‌) ఉంటుంది. ఈ డోమ్‌పై 11 అడుగుల ఎత్తుతో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ భవనంలో ఉండే సౌకర్యాలను పరిశీలిస్తే, 
 
* ఏడు ఫ్లోర్లు + లాబీలు : 6 లక్షల చదరపు అడుగులు
* సెంట్రల్‌ టవర్‌లోని మీటింగ్‌ హాళ్లు, స్కైలాంజ్ ‌: 52 వేల చదరపు అడుగులు 
* ఇతర సౌకర్యాలు : 48వేల చదరపు అడుగులు 
* మొత్తం : 7 లక్షల చదరపు అడుగులు 
 
* ఉద్యోగుల కోసం ప్రతి అంతస్తులో భోజన గది. 
* రికార్డులు, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌, బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాలకు సరిపడా స్థలం. 
* సచివాలయం ఆవరణలో ఒక బ్యాంకు, ఏటీఎం, మందుల దుకాణం, పిల్లలు ఆడుకునే స్థలం, క్యాంటీన్‌, పెట్రోల్‌ బంక్‌, ఫైర్‌స్టేషన్‌, వెయిటింగ్‌ హాల్స్‌. 
కొత్త దేవాలయం, మసీదు.
 
* ఉపరితలం నుంచి జాతీయ చిహ్నం వరకు భవనం ఎత్తు : 278 అడుగులు.
* భవనం పొడవు, వెడల్పులు : 600x300 అడుగులు.
* సచివాలయం మొత్తం విస్తీర్ణం : 27.5 ఎకరాలు
* భవనం, ఇతర వసతుల కోసం వినియోగించేది : 23.5 ఎకరాలు. 
* చుట్టూ రోడ్ల కోసం : 3 ఎకరాలు
 
* భవనం విస్తీర్ణం : 2.4 ఎకరాలు (మొత్తం స్థలంలో 9.7%) 
* ల్యాండ్‌ స్కేపింగ్ ‌: 12 ఎకరాలు (50%) 
* అంతర్గత రోడ్లు, ఫుట్‌పాత్‌లు : 6 ఎకరాలు (25%) 
* పార్కింగ్ ‌: 3.7 ఎకరాలు (15.3%) (650 కార్లు, 500 బైక్‌లు పార్క్‌ చేయవచ్చు)
* సెంట్రల్‌ కోర్ట్‌యార్డ్‌ లాన్‌ : 2.2 ఎకరాలు (9%) 
* భవనం విస్తీర్ణం : 2.4 ఎకరాలు (మొత్తం స్థలంలో 9.7%) 
* ల్యాండ్‌ స్కేపింగ్‌ : 12 ఎకరాలు (50%) 
* అంతర్గత రోడ్లు, ఫుట్‌పాత్‌లు : 6 ఎకరాలు (25%) 
* పార్కింగ్‌ : 3.7 ఎకరాలు (15.3%) (650 కార్లు, 500 బైక్‌లు పార్క్‌ చేయవచ్చు)
* సెంట్రల్‌ కోర్ట్‌యార్డ్‌ లాన్ ‌: 2.2 ఎకరాలు (9%) 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరూట్ నగరం ఖాళీ : శ్మశానాన్ని తలపిస్తున్న రాజధాని ప్రాంతం