Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడ్ న్యూస్: ఆర్టీసీ లావాదేవీలు కోసం.. ఇక యూపీఐ, క్యూఆర్ కోడ్లు

Advertiesment
MGBS
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు అందిస్తున్న సేవలలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నగదు చెల్లింపుల ద్వారానే ఆర్టీసీ లావాదేవీలు నిర్వహిస్తుండగా.. క్రమంగా డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. యూపీఐ/క్యూఆర్‌ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆర్టీసీ.
 
తొలుత.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సెల్, కార్గో సెంటర్ అలాగే రేథిఫైల్ బస్ స్టేషన్ (సికింద్రాబాద్‌)లో బస్ పాస్ కౌంటర్‌లో యూపీఐ/క్యూఆర్‌ కోడ్ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
 
త్వరలో తెలంగాణ అంతటా అమలు చేస్తామని, ప్రజలందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని అలాగే తమ అభిప్రాయాలూ/ సూచనలు ట్విట్టర్(tsrtcmdoffice) ద్వారా అందించి టీఎస్‌ ఆర్టీసీ ద్వారా మరింత మంచి సేవలు పొందాలని ప్రజలకు టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాదాద్రిలో మార్చి 20 నుంచి మహా సుదర్శన యాగం