Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన ఊరు-మన బడి స్కీమ్ గురించి తెలుసా? ప్రత్యేకతలేంటి?

Advertiesment
students
, బుధవారం, 8 జూన్ 2022 (20:36 IST)
తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన పథకాల్లో మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి ఒకటి. 2022 మార్చి 8న వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తోన్న మొత్తం పాఠశాలల సంఖ్య 29,952 కాగా.. వీటిలో 26,065 పాఠశాలలు ప్రభుత్వ స్థానిక సంస్థల కింద నడుస్తున్నాయి. 
 
ఈ పాఠశాలలను ఆధునీకరించేందుకు ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా.. ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే స్కీమ్ పేరును కూడా మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడిగా పెట్టింది. 
 
రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేయనున్నారు.
 
పాఠశాల విద్యను విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం ఈ పథకం ద్వారా రంగం సిద్ధం చేసింది. దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని ఆవిష్కరించింది.
 
ఇందుకోసం ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.7,289 కోట్లను కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపులతో స్కూళ్ల ఆధునీకరణ, మౌలిక సదుపాయల కల్పన చేపట్టనుంది. తొలి దశలో భాగంగా 9 వేలకు పైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా పాఠశాలల స్థాయిలలో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. పూర్వ విద్యార్థులను కూడా దీనిలో భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోంది. 
 
గ్రామాలలోని పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టాలని, అందుకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఈ పథకం కింద ప్రభుత్వం కల్పిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్ బీమా స్కీమ్.. అర్హతలేంటి? ఎలా డబ్బులొస్తాయ్?