Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ గవర్నర్ షాకింగ్ నిర్ణయం - 10 నుంచి ప్రజా దర్బార్

tamizhisai sounderrajan
, బుధవారం, 8 జూన్ 2022 (19:24 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
మహిళా దర్బార్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో మహిళలు పాల్గొనాలని, ఇందుకోసం మహిళలు 040-23310521కు ఫోన్ చేసి లేదా [email protected]కు మెయిల్ చేయాలని తెలిపారు.
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ ఉందని, ప్రతి నెలా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు సవాల్ విసిరిన ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, ఏంటది?