Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ లాక్ డౌన్ ఇప్పట్లో పోయేలా లేదు, మనకిక పెళ్లి కాదని సూసైడ్ చేసుకున్న ప్రేమజంట

Advertiesment
Lockdown effect
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. ఇంటి నుంచి బయటకు వస్తే ఎక్కడ కరోనా వైరస్ పట్టుకుంటుందోనని జనం ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. ఐతే కొందరు మాత్రం ధైర్యం చేసి వచ్చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ కొంతమంది ప్రేమికులను బలి తీసుకుంటోంది.
 
వివరాల్లోకి వెళితే... ఆసిఫాబాద్ పరిధిలోని నార్నూర్ మండలంలో ఖంపూర్ గ్రామంలో 20 ఏళ్ల సీతాబాయి 22 గణేష్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఆమోదం తెలిపారు. త్వరలో పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారు. మే 3 తర్వాత లాక్ డౌన్ ముగియగానే పెళ్లి చేద్దామనుకున్నారు కానీ అది కాస్తా మే 17 వరకూ వెళ్లింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ మే 17 కాదు... నెలాఖరు వరకూ అని తెలిపింది.
 
కరోనా వైరస్ విజృంభించడం, లాక్ డౌన్ కాలం పెరుగుతుండటంతో ఇక తమకు ఇప్పట్లో పెళ్లి కాదని ఆందోళన చెందిన  ప్రేమ జంట మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం పొలం పనుల కోసం అని వెళ్లిన గణేష్ తన ప్రియురాలిని పిలిచి, ఇక లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందోనని తీవ్రంగా ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని ప్రియురాలు తన సోదరుడితో చెప్పి తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఫోన్లో సమాచారం అందించింది. హుటాహుటిన ఆమె సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లగా అప్పటికే ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్షణాలు లేని కరోనా కేసులు.. 380 కేసులు చైనాలో నమోదు