Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఎన్నికలు : కొండా సురేఖకు కాంగ్రెస్ టిక్కెట్ .. 34 మందితో లిస్ట్

Advertiesment
konda surekha
, బుధవారం, 10 అక్టోబరు 2018 (13:56 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేసింది. బుధవారం వెల్లడించిన తొలి జాబితాలో మొత్తం 34 మంది పేర్లను చేర్చింది. వీరిలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చింది. ఈ 34 మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు.
 
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి.. 105 మందితో కూడిన భారీ జాబితాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇలా కేసీఆర్ తొలి రోజునే సమర శంఖం పూరించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకుగాను మొదటి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.
 
ఈనెల 12వ తేదీన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థుల బలాబలాలపై చర్చించి ఐదు రాష్ట్రాల అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 
కాగా, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే:
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
బలరాంనాయక్‌ - మహబూబాబాద్‌
దామోదర రాజనర్సింహ - ఆందోల్‌
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్‌
కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌
ఆరేపల్లి మోహన్‌ - మానకొండూరు
సురేష్‌ షెట్కర్‌ - నారాయణ్‌ఖేడ్‌
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ
దొంతుమాధవరెడ్డి - నర్సంపేట
సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
రమేష్‌ రాథోడ్‌ - ఖానాపూర్‌
పొన్నం ప్రభాకర్‌ - కరీంనగర్‌
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్‌
వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి
జానారెడ్డి - నాగార్జునసాగర్‌
ఉత్తమ్‌ పద్మావతి - కోదాడ
భట్టి విక్రమార్క - మధిర
కొండా సురేఖ - పరకాల
కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్‌
రేవంత్‌రెడ్డి - కొడంగల్‌
సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్‌
ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్‌
షబ్బీర్‌ అలీ - కామారెడ్డి
సుదర్శన్‌రెడ్డి - బోదన్‌
శ్రీధర్‌బాబు - మంథని
మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్‌
జీవన్‌రెడ్డి - జగిత్యాల
గీతారెడ్డి - జహీరాబాద్‌
డీకే అరుణ - గద్వాల
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్దులు పెట్టడానికి రాలేదు - వారిద్దరూ అన్న - పెదనాన్నలు కాదు : పవన్ కళ్యాణ్