అసెంబ్లీని రద్దు చేశాం… మీ సభ్యత్వం రద్దు అయ్యిందంటే ఎలా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డి.కె. అరుణ నిలదీశారు. తమ హక్కులు, అసెంబ్లీ రద్దు చేసిన విధానంపై పిటిషన్ వేశానని అరుణ చెప్పారు. ప్రభుత్వం శాసనసభను రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్దమని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భయంతోనే ఆంధ్రులు టీఆర్ఎస్‌కి ఓటేసారన్నారు. ఆంధ్రుల భవనాలు లాక్కుంటామని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేసారు. కేసీఆర్ ఎవరినైనా తిట్టచ్చు కానీ.. ఆయన్ని మాత్రం ఎవరూ తిట్టకూడదట. కేసీఆర్ ఇంట్లో మహిళలని తిడితే ఊరుకుంటాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే నా బండారం ఏంటో బయట పెట్టాలని సవాల్ విసిరారు డీకే అరుణ.
తాజాగా అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ నేత డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. సభ్యుల అభిప్రాయాలు అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు. మరి.. టీఆర్ఎస్ అరుణ వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తుందో చూడాలి.