Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ ముఖ్యమంత్రా? లేక కాంట్రాక్టర్ల బ్రోకరా?: ఏఐసీసీ

Advertiesment
కేసీఆర్ ముఖ్యమంత్రా? లేక కాంట్రాక్టర్ల బ్రోకరా?: ఏఐసీసీ
, శనివారం, 1 ఆగస్టు 2020 (19:24 IST)
ఆగస్టు 5న ప్రతిపాదిత కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ఎగొట్టనీకెనే రాష్ట్ర ముఖ్యమంత్రి హుటాహుటిన అదేరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు.
 
ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, టెండరు ప్రక్రియ సజావుగా పూర్తి కావడానికి సహకరిస్తూ ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయమిదని అన్నారు.
 
కృష్ణా బేసిన్ నీళ్ళని పెన్నా బేసిన్ కు తరలిస్తూ, పోతిరెడ్డిపాడుకి 4 కిలోమీటర్ల ఎగువన, సంగమేశ్వరం వద్ద,
కృష్ణా నది నుంచి రోజుకు 3 టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ. 3278.18 కోట్ల పనుల టెండర్లు కరారుచేసేది ఆగస్టు 19వ తేది ఐతే, ఆగస్టు 20వ తేది తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంతో ఎమ్ లాభం అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ, కేసీఆర్ ప్రజల ప్రతినిధిగా కాక కాంట్రాక్టర్ల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
 
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సాగునీటి, హైదరాబాద్ పట్టణ త్రాగునీటి అవసరాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడీని అడ్డుకోవడంకన్నా మీ హంగులు, ఆర్భాటాల కోసం నూతన సెక్రటేరియట్ నిర్మాణం ముఖ్యమా? అపెక్స్ కౌన్సిల్ సమావేశం రద్దుచేసుకొని మీరెప్పుడంటే అప్పుడు సమావేశపరుచుకునే మంత్రివర్గ సమావేశం ఆగస్ట్ 5న పెట్టుకోవడం అవసరమా అని ప్రశ్నియించారు.
 
ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు బొంగరంకుడా తిప్పలేకపోతున్నాడని, తెలంగాణ సాగునీటి ప్రయోజనాలని కాపాడడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
 
తెలంగాణ ప్రజలకు నూతన సెక్రటేరియట్ నిర్మాణం కన్నా ఆంధ్రా జలదోపిడీని అడ్డుకోవడమే ముఖ్యమని,
ఆగస్టు 5వ తేదిన మంత్రివర్గ సమావేశాన్ని రద్దుచేసుకొని, ప్రతిపాదిత అపెక్స్ కౌన్సిల్ సమావేశం హాజరయ్యి టెండర్లు దాకలుకు చివరి రోజైన ఆగస్టు 10 లోపే టెండర్ల ప్రక్రియ రద్దు చేయించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో స్కూల్ సమస్యా?... అయితే 9150381111కు ఫోన్ చేయండి