Publish Date: Fri, 02 Oct 2020 (16:23 IST)
Updated Date: Fri, 02 Oct 2020 (16:26 IST)
ఓ మహిళా కార్యకర్తతో రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై అధిష్టానం వేటు వేసింది. సత్యనారాయణ తీరుపై అధిష్టానం తీవ్రంగా మండిపడింది.
స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే సత్యనారాయణను పదవి నుంచి తొలగించారు. బాధ్యత గల పదవిలో ఉండి మహిళా కార్యకర్తతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైంది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా బాస సత్యనారాయణ ఓ మహిళతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.