Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘన - కలెక్టర్ వాహనానికి చలానాలు

Advertiesment
Kamareddy Collector
, బుధవారం, 24 నవంబరు 2021 (12:22 IST)
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు చాలా స్ట్రిక్టుగా నడుచుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వారిలో సాధారణ పౌరుడు నుంచి జిల్లా ప్రథమ పౌరుడు వరకు ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే జిల్లా కలెక్టర్ వాహనానికి ఏకంగా 28 చలాన్లు పంపించారు. 
 
ఈ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం నంబరు టీఎస్ 16, ఈఈ 3366 అనే నంబరు వాహనంపా భారీ మొత్తంలో ఈ-చలానాలు పెండింగ్‌లో ఉన్నట్టు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
గత 2016 నుంచి 2021 ఆగస్టు 20వ తేదీ వరకు ఏకంగా 28 చలానాలు వేశారు. అంటే కలెక్టర్ వాహనానికి రూ.27,580 అపరాధం వేశారు. ఇందులో 24 సార్లు అతివేగంతో వెళ్లినందుకు చలాన్లు విధించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిపిఐ నారాయ‌ణ కాలికి... ఎంపీ గురుమూర్తి మ‌సాజ్