Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

60 మంది నిరుపేద బాలికలకు ఆనందానుభూతులను అందించిన ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌

Girls
, గురువారం, 21 ఏప్రియల్ 2022 (22:34 IST)
తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి- బాలల సంక్షేమశాఖతో పాటుగా నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని ఇనార్బిట్‌ హైదరాబాద్‌ నేడు మాల్‌‌లో గాళ్స్‌ డే ఔట్‌ ఇన్‌ ఇనార్బిట్‌ కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 60 మంది నిరుపేద బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
స్టేట్‌ హోమ్స్‌కు చెందిన ఈ 15-22 సంవత్సరాల బాలికలు, యువతులు మాల్‌లో వినోదాత్మక క్రీడలతో పూర్తి ఆనందానుభూతులను సొంతం చేసుకున్నారు. మాల్‌ ప్రతినిధులు బాలికలకు మాల్‌ గురించిన సమస్త సమాచారం అందించారు. మాల్‌లో ఉన్న షాపర్స్‌ స్టాప్‌ లాంటి స్టోర్స్‌ సందర్శించడంతో పాటుగా పీవీఆర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వీక్షించారు. అనంతరం కెఎఫ్‌సీ ఔట్‌లెట్‌లో లంచ్‌ చేశారు. అనంతరం ఫన్‌ సిటీలో వినోదాత్మక గేమ్స్‌ ఆడారు.

 
‘‘మా మాల్‌లో నిరుపేద బాలికలకు ఆనందాన్ని తీసుకువస్తూ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇక్కడ వారు పూర్తి ఆనందానుభూతులను సొంతం చేసుకున్నారు. వారికి కేవలం వినోదం అందించడం మాత్రమే కాకుండా  ఎలా ఉపాధిని పొందవచ్చో కూడా వారికి వివరించాము. ఈ బాలికలకు మేము స్ఫూర్తి కలిగించగలిగామని  ఆశిస్తున్నాము’’ అని శరత్‌ బెలావడి, సెంటర్‌ హెడ్‌, ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ అన్నారు.

 
ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను ఇనార్బిట్‌ నుంచి ఆశిస్తున్నట్లు స్త్రీ, శిశు, దివ్యాంగ మరియు సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ కమిషనర్‌ మరియు సెక్రటరీ శ్రీమతి దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.30లకు లాటరీ కొంటే.. కోటి రూపాయలు తగిలింది...