ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా ఉండటానికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ల గురిం చి ఆరా తీయడానికి, నిజానిజాలు తెలసుకోవడానికి సైబర్ క్రైమ్ విభాగంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక ల్యాండ్‌లైన్, మరొక మొబైల్‌తో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్‌పై అవగాహన ఉన్న సిబ్బందిని ఉదయం 9:00 నుంచి రాత్రి 8:00 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు.
ప్రజల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్ చేసుకొని వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. తద్వారా ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా, నేరగాళ్ల చేతికి చిక్కి రూ. లక్షల్లో నష్టపోకుండా ముందుగానే నివారించొచ్చు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను సైబర్ క్రైమ్ విభాగం వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోన్‌లోనే కాకుండా.. నెటి జన్లు ఆన్‌లైన్‌లో కూడా సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్‌లు..
మొబైల్ నంబర్- 9490617310
ల్యాండ్‌లైన్ - 04027854031
NCR Portal:https://cybercrime.gov.in