Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్, కవిత కళ్లకు ఈ దారుణం కనపడటం లేదా?: ఇందిరాశోభన్

Advertiesment
Indira shobhan
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (07:00 IST)
మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు రక్షణ కల్పించలేని అసమర్థ కేసీఆర్ తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్. సైదాబాద్ లో చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల పసిపాపపై అత్యాచారం, హత్య జరిగి నాలుగురోజులు గడిచినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పెద్దలెవ్వరూ కనీసం ఈ దుర్ఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

పేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ కు.. ఈ ఘటనపై కనీసం ట్విట్టర్లో అయినా స్పందించేందుకు మనసెందుకు రావడం లేదో అర్థం కావట్లేదన్నారు. ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత కళ్లకు ఈ దారుణం కన్పించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఇక ఈ రాష్ర్టానికి హోంమంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియని దుస్థితిలో ప్రజలున్నారని ఇందిరాశోభన్ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కనాడు కూడా సమీక్షాసమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదన్నారు. ఇక మహిళా మంత్రుల విషయం వేరే చెప్పనక్కర్లేదన్నారు.

కనీసం మానవత్వం ఉన్నవారెవరైనా ఈ ఘటనపై స్పందిస్తారని, అలాంటిది మహిళలై ఉండి, ఒక్క మంత్రి కూడా ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాదు.. షీటీమ్స్ కూడా నిద్రావస్థలోనే ఉండటం దౌర్భాగ్యమన్నారు ఇందిరా శోభన్.

ఈ ఘటన మరుకముందే మియాపూర్ లో 13 నెలల పసికందు హత్యకు గురవడం చూస్తుంటే అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. నిందితుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27 న భారత్‌ బంద్‌... విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం..