ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదులో శనివారం పర్యటిస్తున్న నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఆపై సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నేరుగా పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించొద్దని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.
ఇంకా ప్రధాన పర్యటన సందర్భంగా మోనప్ప జంక్షన్-టివోలి జంక్షన్-సెయింట్ జాన్ రోటరీ-సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్పీరోడ్-ఎస్పీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.
అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే...
టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్రోడ్ల మధ్య ఉన్న రోడ్డును మూసివేస్తారు.
ఎస్బీఎస్ క్రాస్రోడ్ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డు మూసివేత
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్ చేరుకోవాలి. చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశాలను పరిమితం చేశారు.