Publish Date: Sat, 11 Jan 2020 (03:21 IST)
Updated Date: Sat, 11 Jan 2020 (03:22 IST)
తెలంగాణలో కొత్తగా హెలీపోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీటి ద్వారా ఆలయ పర్యాటకానికి ఊతం లభిస్తుందని... దిల్లీలో జరిగిన వింగ్స్-2020 సన్నాహాక సమావేశంలో తెలిపారు.
కొత్త విమానాశ్రయాలు, హెలీపోర్టుల నిర్మాణానికి కేంద్రం నిధులు, అనుమతులు ఇచ్చి సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో జరిగిన వింగ్స్ ఇండియా-2020 సన్నాహాక సదస్సులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ బేగంపేట వేదికగా మార్చి 12 నుంచి 15 వరకు వింగ్స్ ఇండియా సదస్సు జరగనుంది.
ఇందుకోసం దిల్లీలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్ పాల్గొన్నారు. త్వరలో బేగంపేటలో ఇన్‌స్టిట్యూట్ వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో కొత్త విమానాశ్రయాలతోపాటు పలు ప్రాంతాల్లో హెలీపోర్టుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు.
హెలీపోర్టుల ద్వారా ఆలయ పర్యటక అభివృద్ది చెందుతుందన్నారు. సివిల్ ఏవియేషన్ శిక్షణ కోసం బేగంపేటలో ఈ ఏడాది ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తామని.... క్రమంగా ఏరోస్పేస్ యూనివర్సిటీ స్థాయికి విస్తరిస్తామని తెలిపారు. నిధులు, త్వరితగతిన అనుమతులు ఇచ్చి కేంద్రం సహకరించాలని కేటీఆర్ కోరారు.