తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన అమలుచేస్తున్న దళితబంధు పథకం అనేకి ఒక ఆర్థిక సహాయం కాదనీ దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమం అని మంత్రి హరీష్ రావు అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో కూడా డైట్, శానిటేషన్ కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 56 మంది డైట్ శానిటేషన్‌కు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు.
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. దళిత బంధులో భాగంగా కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు.